చెన్నైపై 12 ఏళ్ళ తర్వాత SRH ఘన విజయం సాధించింది. IPL 2025లో భాగంగా శుక్రవారం చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై పై 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 154 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ 44, కమిందు 32, నితీశ్ 19 పరుగులు చేశారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.దింతో చిదంబరం స్టేడియంలో చెన్నైపై 12 ఏళ్ళ తర్వాత SRH ఘన విజయం సాధించింది. ఇక IPL-2025లో SRH ప్లే ఆఫ్ ఆశలు ఇంకా ఉన్నాయ్. ఏదో అద్భుతం జరిగితే కాని ప్లే ఆఫ్‌కు చేరుకోలేరు. అయితే, SRH బ్యాటర్ క్లాసెన్ మాత్రం ప్లే ఆఫ్‌పై భిన్నంగా స్పందించాడు. ‘ మేము బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఫెయిల్ అయ్యాం. మా ఫెయిల్యూర్స్‌పై వర్కౌట్ చేస్తున్నాం. ప్లే ఆఫ్‌కు చేరుకునేందుకు మా ప్రయత్నాలు చేస్తున్నాం’ అని అన్నారు SRH బ్యాటర్ క్లాసెన్.