టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆరెంజ్‌ ఆర్మీ

-

ఐపీఎల్‌ 2022 పోరు రసవత్తరంగా సాగుతోంది. జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అయితే నేడు ముంబాయిలోని బ్రబోర్న్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 2 ఓటముల తరువాత 4 విజయాలతో జోష మీదున్న ఆరెంజ్‌ ఆర్మీ పటిష్టమై ఆర్సీబీ జట్టుపై విజయం సాధిస్తుందా అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా, సన్‌రైజర్స్‌.. 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులపై విజయం సాధించిన ఇరు జట్లు.. నేటి మ్యాచ్‌లోనూ గెలుపుపై ధీమాగా ఉన్నాయి.

తుది జట్లు (అంచనా):

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌, అనుజ్‌రావత్‌, విరాట్‌ కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌, హర్షల్‌ పటేల్‌, హసరంగ, హేజిల్‌వుడ్‌, సిరాజ్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌, రాహుల్‌ త్రిపాఠి, మార్క్రమ్‌, పూరన్‌, శశాంక్‌ సింగ్‌, జగదీష సుచిత్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జన్సెన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌

 

Read more RELATED
Recommended to you

Exit mobile version