సన్రైజర్స్ జట్టు మరోసారి ఛాంపియన్గా నిలిచింది. ఐపీఎల్ టోర్నమెంట్లో దారుణంగా విఫలమవుతున్న సన్రైజర్స్ ఇతర టోర్నమెంట్లో మాత్రం బీభత్సంగా ఆడుతోంది. ఈ తరుణంలోనే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA 20 టోర్నమెంట్ లో సన్రైజర్స్ ఈస్టర్ణ కేప్ జట్టు మరోసారి కప్పు గెలుచుకుంది. దీంతో వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది సన్రైజర్స్. డర్బన్ సూపర్ జెంట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సునాయాసంగా గెలుపొంది రెండవసారి ఛాంపియన్ జట్టుగా నిలిచింది కావ్య పాపా టీం.
ఇక మొదట బ్యాటింగ్ చేసిన SEC మూడు వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది. ఇందులో ఆ బెల్ 55 పరుగులు, స్టెబ్స్ 56 పరుగులు చేసి రాణించారు. అయితే చేజింగ్ లో మాత్రం డర్బన్ సూపర్ జెంట్స్ జట్టు దారుణంగా ఓటమిపాలైంది. కేవలం 115 పరుగులకే ఆల్ అవుట్ అయింది డర్బన్. ఈ తరుణంలోనే.. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఖాతాలో మూడో కప్పు చేరింది. ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ 2016లో విజయం సాధించింది. ఇక SA టీ20లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా 2023, 24లో జయకేతనం ఎగరవేసింది. దీంతో ఐపీఎల్ SA20లో సన్రైజర్స్ డామినేషన్ కొనసాగుతుందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.