“ఎవరిని అయినా తీసేయండి.. కానీ సూర్య కుమార్ యాదవ్ టీం లో ఉండాల్సిందే”

-

టీం ఇండియా మాజీ ప్లేయర్ మరియు స్పిన్నర్ హర్భజన్ సింగ్ వరల్డ్ కప్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ తప్పక తుది జట్టులో ఉండాలని హర్భజన్ సింగ్ ఇండియా టీం యాజమాన్యానికి సలహా ఇచ్చాడు. ఇందుకు సరైన ఉదాహరణను సైతం హర్భజన్ సింగ్ చెప్పడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సమర్ధుడు… ఇంకా కొంచెం సమయంలోనే మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయగల ప్రతిభ సూర్య సొంతము అంటూ హర్భజన్ పొగడ్తలతో ముంచెత్తాడు, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఆస్ట్రేలియా పై రెండవ వన్ డే లో బ్యాటింగ్ చేసిన తీరు.. అందుకే ఖచ్చితంగా సూర్య కుమార్ యాదవ్ ఇండియా వరల్డ్ కప్ లో ఆడే అన్ని మ్యాచ్ లలో ఆడి తీరాలని, అందుకోసం ఎవరిని అయినా తీసివేయండి అంటూ టీం యాజమాన్యానికి సలహా ఇచ్చాడు.

మరి హర్భజన్ సింగ్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని టీం ఇండియా యాజమాన్యం సూర్య కుమార్ ను ప్రతి గేమ్ లో ఆడిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version