అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు రిజర్వ్..!

-

చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా అంగళ్లులో జరిగిన ఘర్షణల్లో చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదయింది. ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తయింది. తర్పును రిజర్వ్ చేశారు.  అంగళ్ల కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దరఖాస్తు చేసుకున్నారు. రెండు  వారాలుగా వాయిదా పడుతూ వస్తున్న కేసులో ఎట్టకేలకు వాదనలు పూర్తయ్యాయి.  చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేశారు. 

చిత్తూరు జిల్లా అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్దయెత్తున ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై చంద్రబాబు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అనేక మంది టీడీపీ  నేతలు అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు.   పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు కేసులో 79 మంది టిడిపి నేతలకు ఎపి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. టిడిపి ఎంఎల్‌సి రామ్ గోపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. బెయిల్ వచ్చిన వారు ప్రతి మంగళవారం నాడు పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసుల్లో మరో 30 మంది టిడిపి నేతలు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీరిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. పుంగనూరు అంగళ్లు కేసులో అరెస్టైన టిడిపి నేతలు, కార్యకర్తలను చిత్తూరు, మదనపల్లె, కడప జైలులో ఉన్నారు. హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి వీరంతా విడుదల అయ్యారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version