‘సూర్య అందుకుంది క్యాచ్ కాదు ఐసీసీ ట్రోఫీ’.. నెట్టింట మీమ్స్

-

వెస్టిండీస్ బర్బడోస్ మైదానంలో టీమ్ఇండియా శనివారం సంచలన విజయాన్ని అందుకుంది. పొట్టి ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కీలక పోరులో భారత్ 7 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టీ20 వరల్డ్కప్ హిస్టరీలో టీమ్ఇండియా రెండోసారి విజేతగా నిలిచి కప్పును ముద్దాడింది. ఈ మ్యాచ్లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ అందుకున్న క్యాచ్ ఆటకే హైలైట్గా నిలిచి చరిత్ర సృష్టించింది.

ఛేజింగ్లో దూసుకుపోయిన సౌతాఫ్రికా విజయానికి చివరి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. క్రీజులో డేంజరస్ డేవిడ్ మిల్లర్ బ్యాట్తో చెలరేగడానికి రెడీగా ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు బంతినిచ్చాడు. ఆ ఓవర్లో తొలి బంతినే మిల్లర్ భారీ షాట్ ఆడగా.. బంతి అమాంతం గాల్లోకి లేచి సిక్సర్వైపు దూసుకుపోయింది. లాంగాన్ ఫీల్డింగ్లో ఉన్న సూర్య వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అసాధారణ రీతిలో బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకుని క్యాచ్ పట్టాడు. ఈ క్రమంలో సూర్య కంట్రోల్ తప్పి బంతిని గాల్లోకి విసిరి, బౌండరీ గీత దాటి వెంటనే మళ్లీ బంతిని అందుకొని క్యాచ్ను పూర్తి చేశాడు. సూపర్మ్యాన్లా క్యాచ్ అందుకున్న సూర్యపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘సూర్య క్యాచ్ కాదు, ఏకంగా ఐసీసీ ట్రోఫీనే అందుకున్నాడు’ అంటూ మీమ్స్ చేసేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version