T20 World Cup 2024: సూపర్ 8లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం

-

T20 World Cup 2024 AUS vs AFG highlights: సూపర్ 8లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపొందింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 127 పరుగులకే కుప్పకూలింది ఆస్ట్రేలియా జట్టు.

T20 World Cup 2024 AUS vs AFG highlights Afghanistan win by 21 runs

దీంతో సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. అటు ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్‌ టీమిండియాతో ఆడబోతుంది. కాగా, ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 24 మ్యాచ్ లకు సారథ్యం వహించారు. అందులో 19 గెలుపు, 4 ఓటములు, ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. విన్నింగ్ పర్సంటేజీ ఏకంగా 86.36 శాతంగా ఉంది. ప్రపంచ క్రికెట్లో మరే కెప్టెన్ కు ఇంత విన్నింగ్ పర్సంటేజీ లేదు. కాగా టీం ఇండియా కెప్టెన్ గా హిట్ మ్యాన్ అసాధారణ విజయాలు అందిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news