గంజాయి, డ్రగ్స్ కట్టడిపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

-

గంజాయి, డ్రగ్స్ కట్టడిపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో జరుగుతున్న నేరాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చీరాల మహిళ హత్య గంజాయి మత్తులో నేరం జరగడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళ హత్య కేసును స్వయంగా పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు….నిందితుల అరెస్ట్ జరిగేంత వరకు కేసు పురోగతిపై నిత్యం ఆరా తీస్తూనే ఉన్నారు.

Chandrababu Sarkar removed Spandana’s name

చీరాల మహిళ హత్య కేసులో నిందితులను 48 గంటల్లో అరెస్టు చేసిన పోలీసులు…..మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం ఆదేశాలతో కదిలిరారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనా ప్రాంతానికి వెళ్లారు హోం మంత్రి అనిత. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం ఉండాలన్న చంద్రబాబు….త్వరలో పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేపట్టనున్నారట. పోలీస్ ఉన్నతాధికారులు మొదలుకుని.. జిల్లా ఎస్పీల వరకు బదిలీలు చేపట్టనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొందరు ఐపీఎస్సులను జీఏడీకి లేదా పోలీస్ హెడ్ క్వార్టర్సుకు త్వరలో బదిలీ చేయనున్నారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news