పార్లమెంట్ ఎన్నికల సమయంలో కర్ణాటకలో చెలరేగిన హాసన్ సెక్స్ స్కాండల్ వివాదం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్నను ఇటీవల అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రేవణ్న ఫ్యామిలీలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. సూరజ్‌పై స్వలింగ వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. జూన్ 16వ తేదీ సాయంత్రం సూరజ్ రేవణ్ణ ఫామ్ హౌస్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని శనివారం రోజున హూలెనరసిపురా పోలీస్ స్టేషన్లో పార్టీ కార్యకర్త ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.. పోలీసులు సూరజ్‌పై ఐపీసీ సెక్షన్ 377, 506(బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఆరోపణలను సూరజ్ రేవణ్ణ తీవ్రంగా ఖండించారు. డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.