ఒలింపిక్ విజేతకు బహుమతిగా అదిరిపోయే కారు : టాటా

-

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మెడల్ తీసుకొచ్చిన భారత హాకీ ఇండియా అథ్లెట్‌కు టాటా కంపెనీ అదిరిపోయే బహుమతిని ఆఫర్ చేసింది. టాటా కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ అయిన CURVV కర్వ్ ఎలక్ట్రిక్ కారును వినియోగదారులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ బ్రాండ్ మొట్టమొదటి కారును ఒలింపిక్ విజేత, హాకీ ఇండియా మాజీ గోల్ కీపర్ అయిన శ్రీజేశ్‌కు అందించినట్లు పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్‌లో శ్రీజేశ్ ప్రత్యర్థి జట్టును నిలువరించి ఫైనల్లో బ్రాంజ్ మెడల్‌ను సాధించిన విషయం తెలిసిందే.

అయితే, ఒలింపిక్ విజేతకు తొలి కారును అందించడం ఆహ్వానించదగ్గ విషయమని టాటా కంపెనీని సోషల్ మీడియాలో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ఈ కారు ధర మార్కెట్లో 17.49 లక్షలుగా ఉన్నది.అయితే, శ్రీజేశ్ ఒలింపిక్‌లో పతకం సాధించిన అనంతరం క్రీడలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీజేశ్ హాకీకి వీడ్కోలు పలకగా.. భవిష్యత్ కార్యాచరణ గురించి ఇంకా ఏమీ ప్రకటించలేదు.కాగా, గత ఒలింపిక్, ఆసిగా గేమ్స్‌లోనూ శ్రీజేశ్ నాయకత్వంలో టీమిండియా హాకీ జట్టు మెడల్ సాధించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news