మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ తో టీమిండియా తలపడుతున్న విషయం తెలిసిందే. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులు చేసింది. దీంతో భారత్ 311 పరుగుల వెనుకంజలో కొనసాగింది. టీమిండియా తొలి ఓవర్ లోనే రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా ఓటమిపాలవుతుందని అంతా భావించారు.
కానీ కెప్టెన్ శుబ్ మన్ గిల్, ఓపెనర్ కేఎల్ రాహుల్ అడ్డుగోడగా నిలబడి టీమిండియా వికెట్లు పోకుండా కాపాడారు. టీమిండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. 238 బంతుల్లో గిల్ 103 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా సెంచరీ చేసేలా కనిపించినప్పటికీ 90 పరుగుల వద్ద స్టోక్స్ బౌలింగ్ లో LBW గా వెనుదిరిగాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ 21, రవీంద్ర జడేజా (0) క్రీజులో ఉన్నారు. వికెట్లు కోల్పోకుండా టీమిండియా కాపాడుకుంటే మ్యాచ్ డ్రా గా ముగుస్తుంది. లేదంటే టీమిండియా ఓటమి పాలవ్వడం ఖాయం. దీంతో సిరీస్ ను ఇంగ్లండ్ జట్టు కైవసం చేసుకుంటుంది.