సిక్స్ కొట్టి అద్దం పగులగొట్టిన టీంఇండియా టీ20 హిట్టర్

-

నిన్న దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా రెండవ T 20 లో భారత్ దక్షిణాఫ్రికా తో తలపడింది. ఈ మ్యాచ్లో యువ క్రికెటర్ రింకు సింగ్ చెలరేగి పోయాడు. 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ వచ్చిన రింకు సింగ్ 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేశాడు. అయితే 19 ఓవరు ఈ మ్యాచ్ కి హైలెట్గా నిలిచింది ఎందుకంటే మారక్రం వేసిన ఈ ఓవర్లో ఒక బాలు సిక్స్ కొట్టిన రింకు ఆ తర్వాత బాల్ కూడా సిక్స్ కొట్టడంతో అది నేరుగా వెళ్లి మీడియా బాక్స్ కు రక్షణ కలిగించే ఒక అద్దానికి తాకింది.

Team India T20 hitter who hit a six and broke the mirror

అయితే రింకు కొట్టిన ఈ సిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాను కొట్టిన సిక్స్ వల్ల అద్దం పగిలిందని నాకు తెలియదని మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రమే తనకు తెలిసిందని అలా అయినందుకు రింకు సింగ్ క్షమాపణలు చెప్పాడు. అద్దం పగిలినందుకు క్షమాపణ చెప్పిన రింకు ఎంతో హంబుల్ పర్సన్ అని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియ 19.3 ఓవర్స్లో 180 పరుగులు చేసింది. అయితే వర్షం పడిన కారణంగా టార్గెట్ ను కుదించడంతో సౌత్ ఆఫ్రికాకు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news