టీమిండియా స్టార్ ప్లేయర్, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి గురించి తెలియని వారుండరు. మొన్న ఆస్ట్రేలియా గడ్డపైన విరోచిత పోరాటం చేసి… రచ్చ చేశాడు తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి. దీంతో ఒక్క సారిగా పాపులర్ అయ్యాడు తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి. అయితే.. తాజాగా తిరుమలలో ప్రత్యక్షమయ్యాడు ఈ క్రికెటర్.
తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. కాలినడకన కొండపైకి వెళ్లిన ఆయన మోకాళ్లపై మెట్లు ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ ఇన్స్టాలో షేర్ చేశారు. ఆస్ట్రేలియాతో BGT సిరీస్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇవాళ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకోనున్నారు తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఈ మేరకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మోకాళ్ళపై మెట్లెక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి pic.twitter.com/eCOniYEwLi
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025