సానియా మీర్జా చివరి టోర్నీ అదేనట.. ఆ తర్వాత రిటైర్మెంట్

-

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన రిటైర్మెంట్‌ ఎప్పుడో ప్రకటించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు సానియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్‌ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది. ఈ మేరకు మూడు పేజీల నోట్‌ను ట్విటర్‌లో విడుదల చేసింది. ఇందులో సానియా టెన్నిస్‌లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి వివరించింది.

30 సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో తన తల్లితో కలిసి తొలిసారి నిజాం క్లబ్‌లో టెన్నిస్‌ కోర్టుకు వెళ్లానని, అక్కడ కోచ్‌.. టెన్నిస్‌ ఎలా ఆడాలో వివరించిందినట్లు గుర్తు చేసుకుంది. ఆరేళ్ల వయసు నుంచే తన కలలను సాకారం చేసుకునేందుకు పోరాటం మొదలైందన్న సానియా.. అన్ని సమయాల్లో తల్లిదండ్రులు, కుటుంబం, కోచ్‌, ఫిజియో, మొత్తం టీం మద్దతిచ్చిందని చెప్పింది. వాళ్లు లేకపోతే తన ప్రయాణం ఇలా సాగేది కాదని పేర్కొంది.

ప్రతి ఒక్కరితో కన్నీళ్లు, బాధ, సంతోషం పంచుకున్నానన్న సానియా.. అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారికి కలలు కనే ధైర్యాన్ని అందించడమే కాకుండా ఆ కలలను సాధించడంలో సహాయం చేశారంటూ సానియా మీర్జా ధన్యవాదాలు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version