IPL 2023 : ఫైనల్‌లో సందడి చేసే సెలబ్రెటీలు వీరే!

IPL 16వ సీజన్ రేపటితో ముగియనుంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా రేపు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కు ముందు కొంతమంది సెలబ్రిటీలు పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.

ర్యాపర్ డీజే న్యూక్లెయ, సింగర్స్ జోనిత గాంధీ, డివైన్ లు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు టోర్నీ నిర్వాహకులు తెలిపారు. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. కాగా, క్వాలిఫైడ్-2 మ్యాచులో ముంబైపై గుజరాత్ 62 రన్స్ తేడాతో గెలిచింది. GT నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని MI చేదించలేకపోయింది. 18.2 ఓవర్లలో 171 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. సూర్య 61, తిలక్ 43, గ్రీన్ 30 రన్స్ తో రాణించిన MIకి విజయాన్ని అందించలేకపోయారు. GT బౌలర్లలో మోహిత్ 5, షమీ 2, రషీద్ 2 వికెట్లు పడగొట్టగా, లిటిల్ 1 వికెట్ తీశారు. ఆదివారం చెన్నై, గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.