ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా నిన్న రాత్రి లక్నో వర్సెస్ ముంబై జట్ల మధ్య హోరా హోరా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ముంబై పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తిలక్ వర్మను రిటైర్డ్ హర్ట్ మ్యాచ్ మధ్యలోనే బయటకు పంపడం పై మాజీలు, క్రికెట్ ఫ్యాన్స్ ముంబై యజమాన్యం పై మండిపడితున్నారు. ఇది అతడిని అవమానించడమేనని ఫైర్ అవుతున్నారు. తిలక్ స్థానంలో వచ్చిన శాంట్నర్ ఎన్ని సిక్సులు కొట్టాడని ప్రశ్నిస్తున్నారు. శాంట్నర్ కి హార్దిక్ చివరి ఓవర్ లో ఎందుకు స్ట్రైక్ ఇవ్వలేదని నిలదీస్తున్నారు.
గుజరాత్ పై ఫెయిల్ అయిన పాండ్యను ఎందుకు రిటైర్డ్ హర్ట్ గా పంపలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో లక్నో ఆల్ రౌండ్ ప్రదర్శనతో మళ్లీ గెలుపు రుచి చూసింది. 12 పరుగుల తేడాతో ముంబయిని ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 203 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది. మిచెల్ మార్ష్ 60, మార్ క్రమ్ 53 సత్తా చాటారు. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీయడం విశేషం.