రన్ మెషిన్ విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రేమికులను నిరాశ పరుస్తున్నారు. ఐపీఎల్లో పరుగుల వరద పారించిన అతడు పొట్టి ప్రపంచకప్ లో ఆకట్టుకోలేకపోతున్నారు. అమెరికా గడ్డపై పరుగులు చేయడానికి నానా తంతాలు పడుతున్నారు. ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న కోహ్లీ గత రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో 1, 4 స్కోర్లతో వెనుదిరిగారు. తాజాగా USAతో మ్యాచ్ లోను డకౌట్ అయ్యారు. కోహ్లీ ఫామ్ పై ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, నిన్న USతో మ్యాచ్ లో భారత్ కు అదృష్టం కలిసి వచ్చింది. 30 బంతుల్లో 35 రన్స్ చేయాల్సి ఉన్నప్పుడు స్టాప్ క్లాక్ రూల్ వల్ల 5 పరుగులు కరిగిపోయాయి. ICC కొత్త రూల్ ప్రకారం ఓవర్ ముగిశాక 60 సెకండ్లలో మరో ఓవర్ మొదలుపెట్టాలి. ఇన్నింగ్స్ లో US జట్టు ఇలా చేయడంలో మూడుసార్లు విఫలమవడంతో అంపైర్లు ఐదు పరుగులు జరిమానా విధించారు. దీంతో భారత్ లక్ష్యం తగ్గిపోయింది. మొత్తంగా 111 పరుగుల టార్గెట్ ను 18.2 ఓవర్లలో చేదించింది.