వార్నర్ ఫ్యాన్స్ స్పెషల్ గిప్ట్.. జై రామ్ అంటూ నినాదాలు చేసిన వార్నర్..!

-

ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తమ సెకండ్ హోంగ్రౌండ్లో మ్యాచ్ లో ఆడేందుకు వైజాగ్ చేరుకుంది. ఈ నేపధ్యంలోనే ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వైజాగ్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. వార్నర్ వైజాగ్ వచ్చిన సందర్భంగా స్థానికంగా ఉన్న కొందరు ఫ్యాన్స్ ఆయనకు సత్కారం జరిపి, ప్రత్యేక బహుమతి అందజేశారు.

వైజాగ్ లోని తెలుగు ఫ్యాన్స్ వార్నర్కు జై శ్రీరామ్ కండువా కప్పి సత్కరించడంతో పాటు అయోధ్య ప్రతిమను బహుమతిగా అందజేశారు. దీంతో ఫ్యాన్స్ అందించిన బహుమతికి ఫిదా అయిన వార్నర్.. వారితో కలిసి జై శ్రీరాం అంటూ నినాదాలు కూడా చేశారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తమ సెకండ్ హోంగ్రౌండ్ గా విశాఖను ప్రకటించింది. ఇందులో భాగంగానే మొదటి భాగం మ్యాచ్ లను ఆడేందుకు వైజాగ్ చేరుకున్న ఢిల్లీ జట్టు.. మధురవాడ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version