గత కొన్ని రోజులుగా సురేష్ రైనా టాపిక్ చర్చనీయాంశంగా మారింది. సీఎస్కే తరపున ఆడేందుకు దుబాయ్ వెళ్ళిన రైనా, సడెన్ గా ఇండియాకి తిరిగివచ్చేయడంతో మొదలైన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. రైనా మేనత్త భర్త దుండగుల చేతిలో మరణించడం, అతనితో పాటు రైనా కజిన్ కూడా ప్రాణాలు కోల్పోవడం వల్ల ఇంటికి తిరిగొచ్చానని రైనా స్పష్టం చేసాడు. అంతకుముందు హోటల్ రూమ్ గొడవ, సీఎస్కే జట్టు సీఈవో జరిగిన పరిణామాలు కారణం కాదని స్పష్టం చేసాడు.
ఐతే ఈ నేపథ్యంలో రైనా దుబాయ్ నుండి తిరిగిరావడం, ఈ సంవత్సరం చెన్నై తరపున ఆడకపోవడం వంటి విషయాలపై తాజాగా మాట్లాడాడు. సీఈవీవో శ్రీనివాసన్ తనపై చేసిన విమర్శలపై స్పందించిన రైనా, తానెందుకు ఇంటికి తిరిగొచ్చానో తెలియక అలా మాట్లాడి ఉంటాడని, ఆయనంటే తనకు గౌరవం ఉందని, తనని చిన్న కొడుకులా చూసుకున్నాడని, అలాంటి వ్యక్తి ఏదైనా మాటంటే తండ్రి మందలించాడని ఊరుకుంటానని చెప్పాడు.
ఇండియాకి తిరిగొచ్చాక రైనా క్వారంటైన్లో ఉంటూనే ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడట. అంతే కాదు ఈ సంవత్సరం మళ్లీ జట్టులో కనిపించినా కనిపించవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చెన్నై జట్టుకి పూర్తిగా దూరం అయిపోయాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో రైనా మాటలు ఆలోచనల్లో పడేస్తున్నాయి. అందరి ఊహకి అందని విధంగా మరోసారి జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తుంది.