వెస్టిండీాస్ తో జరిగిన చివరి టీ-20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ ను 5-0 తేడాతో గెలిచి విండిస్ ను వైట్ వాష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండిస్ 170 పరుగులకు ఆలౌట్ అయింది. 171 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 17 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గ్రీన్ (32), ఒవెన్ (37), టిమ్ డేవిడ్ (30) రాణించారు. ఐసీసీలో పూర్తి సభ్యదేశాన్ని 5-0 తేడాతో టీ-20 సిరీస్ లో ఓడించడం ఇదే తొలిసారి.
ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా వెస్టిండీస్ జట్టు 27 పరుగులకే ఆలౌట్ అవ్వడం ఒక పెద్ద షాకింగ్ విషయం అనే చెప్పాలి.
దీనితో, వెస్టిండీస్ క్రికెట్ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వన్డే, టీ-20, టెస్ట్ సిరీస్ లలో అన్నింటిని ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకోవడం విశేషం.