ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదోన్నతుల కీలక నిర్ణయం

-

ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీలోని అన్ని ర్యాంకుల ఉద్యోగులకు వచ్చే నెలాఖరు వరకు పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి పల్లె వెలుగు బస్సుల సంఖ్య పెంపుపై నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించారు. 11వేల బస్సుల్లో 74 శాతం బస్సులను మహిళల కోసం ఉచిత ప్రయాణానికి కేటాయిస్తున్నామని తెలిపారు. బస్టాండ్లలో మౌలిక సదుపాయాల పై దృష్టి సారించామని తెలిపారు. 

RTC

 

ఇప్పటికే 750 నూతన బస్సులు మంజూరయ్యాయని.. మరో 600 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. వచ్చే నెల నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినందన మొత్తం 11వేల బస్సుల్లో 74 శాతం బస్సులను అందుకు కేటాయిస్తున్నామని తెలిపారు. ఉచిత సౌకర్యాన్ని ప్రస్తుత జిల్లాలకే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాలకు విస్తరించడం పై కసరత్తు చేస్తున్నామని వివరించారు. వచ్చే రెండు నెలల్లో ప్రతీ బస్టాండ్ లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news