US OPEN లో సంచలనం : వరల్డ్ నంబర్ 1 కు షాక్ …

-

యుఎస్ ఓపెన్ 2023 ఆగష్టు 30వ తేదీ నుండి స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా పురుషులు మరియు మహిళలకు సింగిల్స్ , డబుల్స్ మరియు మిక్సెడ్ డబుల్స్ జరుగుతున్నాయి. కాగా గత రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్ లో ఒక సంచలనం నమోదు అయింది. మహిళల ప్రీ క్వార్టర్స్ లో భాగంగా వరల్డ్ నెంబర్ క్రీడాకారిణి గా ఉన్న స్వీయాటెక్ తన ప్రత్యర్థి మరియు 20 వ ర్యాంక్ లో ఉన్న ఒస్తాపెంకో చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. మూడు సెట్ల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో స్వీయాటెక్ మొదటి సెట్ ను 6 – 3 తేడాతో సొంతం చేసుకుంది. ఇక మొదటి సెట్ జరిగిన తీరు చూస్తే ఛాంపియన్ కు ఎదురులేదని అంతా ఊహించారు. కానీ ఒస్తపెంకో మాత్రం రెండవ సెట్ లో చాలా కసిగా ఆడి 3 – 6తో సమం చేసింది. ఇక నిర్ణయాత్మక మూడవ సెట్ లో మాత్రం స్వీయాటెక్ పూర్తిగా తేలిపోయింది.

వరుస బ్రేక్ పాయింట్లు సాధించిన ఒస్తపెంకో 6 – 1 తో సెట్ ను మరియు మ్యాచ్ ను గెలుచుకుని వరల్డ్ నెంబర్ 1 కు షాక్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version