పొంగులేటి, తుమ్మలపై పువ్వాడ సీరియస్ అయ్యారు. వారివి శిఖండి రాజకీయాలు అంటూ మండిపడ్డారు. ఖమ్మంలోని మమత ఆసుపత్రిలోని తన ఇంట్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
KCR గారు నాకు క్యాబినెట్ హోదా కల్పించి 4 సంవత్సరాలు కావొస్తుందని…. నేను దానిని శిరసా వహించి….పూర్తి బాధ్యత గా ఎక్కడా నాపదవికి ఎక్కడా కళంకం రాకుండా సమర్థవంతంగా పూర్తి చేశానని వెల్లడించారు. మున్నేరులో మూడు చెక్ డ్యామ్ లు నిర్మాణం చేయబోతున్నామని పేర్కొన్నారు. మున్నేరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా వ్యుపాయింట్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నోటిఫికేషన్ రాకముందే…కేబుల్ బ్రిడ్జ్ కి,రక్షణ గోడకు శంకుస్థాపన చేస్తామన్నారు. CM KCR గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలుపెడతామని పువ్వాడ అజయ్ ప్రకటించారు. KCR నన్ను ఖమ్మం జిల్లాకు మంత్రిగా నియమించిన తరువాత ఈ జిల్లాకు వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ జిల్లా అభివృద్ధికి కి బాటలు వేసానన్నారు.