సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో టీం ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది కంగారు జట్టు. ఈ తరుణంలోనే… 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ గెలుచుకుంది ఆసీస్. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించింది ఆసీస్.
5 టెస్ట్ ల సిరీస్ ను 1-3 తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా.. బ్రిస్బేన్ టెస్ట్ ను డ్రా గా ముగించింది. అటు సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడంతో… టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సిడ్నీటెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయంతో…. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది ఆసీస్. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు గల్లంతు అయ్యాయి. దీంతో… డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆడే ఛాన్సులు ఉన్నాయి.