మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు

-

టీమ్ ​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చాయి. ఓ మహిళ యువీ కుటుంబాన్ని బురిడి కొట్టించాలని పథకం వేసి చివరకు దొరికిపోయింది. యువరాత్ ఫ్యామిలీని ఓ తప్పుడు కేసులో ఇరిక్కించాలని.. అతడి తల్లిని, కుటుంబాన్ని బెదిరించి రూ.40 లక్షలు వసూలు చేసేందుకు విఫలయత్నం అయింది. ఫలితంగా జైలులో ఊచలు లెక్కపెడుతోంది.

యువరాజ్ సింగ్ సోదరుడు జోరావర్ సింగ్​ చాలా ఏళ్ల నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. యూవీ తల్లి షబ్నామ్​ సింగ్​.. జోరావర్​ కోసం 2022లో హేమా కౌషిక్​ అనే మహిళను కేర్​ టేకర్​గా నియమించుకుంది. పనిలో చేరిన హేమా కౌషిక్​.. కొంత కాలం తర్వాత నుంచి వాట్సాప్​ మెసేజ్​ల ద్వారా యూవీ కుటుంబాన్ని బ్లాక్​ మెయిల్​ చేయడం ప్రారంభించింది. తనకు రూ.40 లక్షలు ఇవ్వాలని లేకపోతే తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ, కుటుంబ పరువును దెబ్బతీస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. యూవీ ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news