నేడు భారత్, జింబాబ్వే మధ్య చివరి టీ20..కీలక మార్పులతో ఇరు జట్లు !

-

Zimbabwe vs India, 5th T20I: భారత్, జింబాబ్వే జట్ల మధ్య నేడు (ఆదివారం) చివరి(ఐదో) టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా(3-1) సిరీస్‌ను సొంత చేసుకోగా, ఈ మ్యాచ్ నామమాత్రంగా జరగనుంది. మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత జట్టు విజయంతో చివరి మ్యాచ్‌నూ ముగించాలని చూస్తుంది. అటు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని జింబాబ్వే చూస్తోంది.

Zimbabwe vs India, 5th T20I

ఇది ఇలా ఉండగా,  జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 153 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (93*), శుభ్మన్ గిల్ (58*) దూకుడుగా ఆడారు. జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధనాధన్ షాట్లతో రాణించారు. నామమాత్రమైన చివరి మ్యాచ్ ఇవాళ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news