Anant Ambani Gifts INSANELY Expensive Watches To Shah Rukh Khan, Ranveer Singh: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీ ఈ పెళ్లి వేడుకకు హాజరైన పలువురు స్నేహితులకు రూ.2 కోట్ల విలువైన వాచ్‌లను గిఫ్ట్‌గా ఇచ్చారు.

ఈ ఖరీదైన వాచ్‌లు అందుకున్న వారిలో.. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, రణ్‍వీర్ సింగ్ కూడా ఉన్నారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు దేశదేశాల నుంచి ప్రముఖ నటీనటులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు అతిథులుగా వచ్చారు.