చిరంజీవి కూతురు శ్రీజ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు శ్రీజ వార్తలు ఇదివరకు వచ్చాయి మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మొదట ఒక వ్యక్తిని ప్రేమించి ఇంటి నుండి వెళ్లిపోయింది. ఒక కూతురు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుని మళ్ళీ చిరంజీవి దగ్గరికి వచ్చింది ఆమె బాధని చూడలేక మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో పెళ్లి చేశారు వీళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది. మళ్లీ మనస్పర్ధలు రావడం వలన విడాకులు తీసుకుని వీళ్ళు విడిపోయారు. అధికారిక ప్రకటన ఈ విషయంపై రానప్పటికీ కళ్యాణ్ దేవ్ పోస్టులతో హింట్ ఇచ్చారు.
కూతురులతో పాటుగా శ్రీజ కొన్నాళ్ల నుండి చిరంజీవి దగ్గరే వుంది. శ్రీజ పెళ్లి విడాకుల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. మెగా ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారని విడాకులు తీసుకున్నప్పుడు చాలా మంది చాలా మాటలు అన్నారు. నన్ను నా కుటుంబాన్ని బ్లేమ్ చేశారు అని అన్నారు. ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు ఒకరినొకరు తెలుసుకోవాలి వాళ్ళు మన ఇంట్లో అమ్మానాన్నలా ఉండరు కదా అని ఆమె అన్నారు. అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు. మా చిరంజీవి గారికి నేనంటే ప్రాణం అని చెప్పుకొచ్చారు శ్రీజ.