ఏపీ నుంచి జపాన్ కు యూరియా తరలించినట్లు సోషల్ మీడియాలో వార్తలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. కేంద్రం నుంచి అదనంగా యూరియా సరఫరా అవుతున్నదనే వాస్తవం వక్రీకరించి కేంద్రం నుంచి వచ్చిన యూరియా ను అటు నుంచి అటే జపాన్ కు తరలించినట్లు ఒక ఫేక్ వార్తను కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ టీం పేర్కొంది.

ఒక అగ్ర నటుడు ఫోటో తో బోగస్ ఐడి తో చేస్తున్న ఈ ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ఫేక్ ప్రచారం లో వాడిన ఫోటో బ్రెజిల్ దేశానికి సంబంధించినదని తెలిపింది.. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి వారి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని కోరింది ఏపీ సర్కార్.
కేంద్రం నుంచి అదనంగా యూరియా సరఫరా అవుతున్నదనే వాస్తవం వక్రీకరించి కేంద్రం నుంచి వచ్చిన యూరియా ను అటు నుంచి అటే జపాన్ కు తరలించినట్లు ఒక ఫేక్ వార్తను కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఒక అగ్ర నటుడు ఫోటో తో బోగస్ ఐడి తో చేస్తున్న ఈ ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ ఫేక్… pic.twitter.com/b0NINrD10G
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) September 9, 2025