asia cup 2022 : ఆసియా కప్ లో భాగంగా నిన్న ఆఫ్ఘన్, శ్రీలంక జట్లు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో ఆఫ్గాన్ చేతిలో ఎదురైన ఓటమికి లంక బదులు తీర్చుకుంది. ఈ నేపథ్యంలోనే టీ 20 క్రికెట్ లో ఆఫ్గాన్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
2015 నుంచి చూసుకుంటే.. ఆఫ్గాన్ పై ఒక జట్టు.. అత్యధిక పరుగులను ఛేజింగ్ చేయడం ఇది నాలుగో సారి. ఇక ఆఫ్గాన్ పై భారీ లక్ష్యాన్ని చేధించిన మూడో జట్టుగా శ్రీలంక నిలిచింది.
తాజాగా మ్యాచ్ లో లంక ఆఫ్గాన్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంతకముందు ఇదే ఏడాది బెల్ పాస్ట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్.. ఛేజింగ్ లో 169 పరుగులు చేసింది గెలిచింది. ఇక తాజాగా షార్జా వేదికగా శ్రీలంక తమ టీ 20 క్రికెట్ లో భారీ లక్ష్యాన్ని చేధించి.. రికార్డు నమోదు చేసింది. ఇక ఇదే ఆసియాకప్ లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ లంక భారీ లక్ష్యాలను చేధించింది.