మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ మొక్క దివ్య ఔషధమే.. ఇంకా ఈ సమస్యలకు కూడా..!

-

మధుమేహ వ్యాధిగ్రస్థులు దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లే తమ జీవితాన్ని గడుపుతారు. రోజూ టాబ్లెట్‌ పడాల్సిందే లేదంటో షుగర్‌ లెవల్స్‌ పడిపోయి ఆగం ఆగం అవుతారు. వీటితో పాటు తినే తిండి.. కూడా షుగర్‌ లెవల్స్‌ను నియంత్రించేదిగా ఉండాలి. అయితే ఇంగ్లీష్‌ మందులకంటే.. షుగర్‌ను ఆయుర్వేద చిట్కాలతోనే మంచిగా నియంత్రించుకోవచ్చు. అందులో ఒకటి ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిట్కా.. సర్వసతి మొక్క గురించి మీరు వినే ఉంటారు. ఇది ముధుమేహంను అదుపులో ఉంచుతుంది. ఇంకా మొక్క చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.. అదేంటంటే..

ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను క‌రిగించ‌డానికి స‌ర‌స్వ‌తి ఆకు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. స‌ర‌స్వ‌తి ఆకుల నుంచి ర‌సం తీసి అందులో కొద్దిగా వాము క‌లిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ క్ర‌మంగా క‌రిగి పోయి గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.

ఆకులు మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. జ్ఞాప‌క‌శక్తిని పెంచుతాయి.

స‌రస్వ‌తి ఆకులు నాలుగు న‌మిలి తింటే మేథ‌స్సు పెరుగుతుంద‌ని ఆయుర్వేదంలో చెబుతారు.

మాన‌సిక ఒత్తిడి, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం ఈ ఆకుల‌ను తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో ఒక టేబుల్ స్పూన్ స‌ర‌స్వ‌తి ఆకు ర‌సం క‌లిపి తీసుకోవాలి. ఒత్తిడి, డిప్రెష‌న్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మెద‌డు చురుగ్గా, ఉత్సాహంగా ప‌ని చేస్తుంది.

ప‌చ్చ కామెర్లు వ‌చ్చిన వారికి స‌ర‌స్వ‌తి మొక్క ఆకుల రసాన్ని నిత్యం తాగిస్తుంటే ఆ వ్యాధి నుంచి వెంట‌నే కోలుకుంటారు.

ఆకుల ర‌సం తాగితే ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్తం శుభ్రంగా మారుతుంది.

సరస్వతి మొక్క‌ ఆకులను నీడలో ఎండబెట్టాలి. 5 బాదంపప్పులు, 2 మిరియాలు, వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా పేస్ట్‌లా చేసి… తరువాత ఆ మిశ్ర‌మాన్ని పలుచని వస్త్రంతో వడకట్టి అనంత‌రం వ‌చ్చే ద్ర‌వంలో తగినంత తేనె కలిపి తాగాలి. ఇలా చేస్తే గొంతు బొంగురు త‌గ్గుతుంది. స్వ‌ర‌పేటిక వృద్ధి చెందుతుంది. మంచి కంఠ స్వ‌రం కూడా వ‌స్తుందట.

మ‌ధుమేహం వ్యాధిగ్ర‌స్తుల‌కు కూడా స‌ర‌స్వ‌తి ఆకు ఒక దివ్యౌష‌ధం. సరస్వతి ఆకులను నీడలో ఎండ బెట్టి పొడి చేసుకుని, పావు స్పూన్ చొప్పున ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకోవాలి. ఇలా మ‌ధుమేహులు చేస్తే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

స‌ర‌స్వ‌తి ఆకు ర‌సాన్ని త‌ర‌చూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు దరిచేరవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version