జీ-5 లో శ్రీదేవి సోడా సెంటర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాకు పలాస ఫేమ్ కరుణాకరన్ దర్శకత్వం వహించారు. సినిమాలో సుధీర్ బాబుకు జోడిగా ఆనంది నటించింది. ఇక ఈ సినిమాను 70 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీదేవి సోడా సెంటర్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 సొంతం చేసుకుంది.

అంతే కాకుండా దీపావళి కానుకగా నవంబర్ 4 నుండి ఈ సినిమాను జి-5 స్ట్రీమింగ్ చేయనుంది. పల్లెటూరి ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. థియేటర్ లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. మరి ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉండగా సుధీర్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా షూటింగ్ లో ఉండగా… మాయదారి మల్లిగాడు, అగ్గి పుల్ల లాంటి చిత్రాలలోనూ నటిస్తున్నాడు.