తాజగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన టిడిపి నాయకులు ఇంకా ఆ చీకటి విషాదం నుండి ఇంకా తెరుకోలేకపోతున్నారు. ఓటమిని ఇంకా చాలా మంది నాయకులు అంగీకరించలేకపోతున్నారు. ఓటమి వల్ల రాష్ట్రంలో చాలా చోట్ల టిడిపి తన అస్తిత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గంలో పార్టీని నడిపించేవాడు లేక పార్టీ కార్యాలయం మూతపడింది. గతంలో ఇక్కడ ప్రతిభా భారతి ప్రతినిత్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా పనిచేశారు. అయితే ఆమె 2004, 2009, 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. దీనితో 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున కొండ్ర మురళి మోహన్ కు ఎన్నికల బరిలో నిలబెట్టారు. కొండ్ర కూడా వైసిపి తాకిడికి తట్టుకోలేకపోయారు. అలాగే పార్టీని, పార్టీ నియమాలను, కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. దీనితో ఇప్పుడు రాజం నియోజక వర్గంలో టీడీపీని నడిపించే నాయకుడి కోసం. చంద్రబాబు ఎదురు చేస్తున్నారు.
ఇదే సమయంలో అక్కడి వైసీపీ నాయకురాలు కంబాలా జోగుల పార్టీని, ప్రభుత్వం కార్యకలాపాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుళ్తున్నారు. ఇదే తరుణంలో తన కుతురైన గ్రీష్మకు గత ఎన్నికల్లో సీట్ ఇవ్వకపోవడం వల్ల ప్రతిభా భారతి కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. రాజాం నియోజక వర్గంలో టిడిపి భవిష్యత్తు ఏమవుతుందోనని, దాని దారి ఏటో అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు