ప్రకాష్ రాజ్ ట్వీట్ కి హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్స్ ..!

-

విలక్షణమైన నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదిక గా కరోనా విషయంలో, పేదలను ఆదుకునే విషయంలో స్పూర్తి దాయకమైన మాటలు చెప్పారు. ప్రకాష్ రాజ్ సమాజం పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తారన్న విషయం అందరికి తెలిసిందే. ఒకానొక సందర్భంలో తనే డబ్బు కోసం ఎదురుచూన్న సమయంలో తనదగ్గరకి సహాయం కోసం వచ్చిన వ్యక్తికి డబ్బు ఇచ్చి పంపిన గొప్ప వ్యక్తితం ఉన్న మనిషి. సాధారణంగా ఇలా చేయడం అంత సులభమైన విషయం కాదు. అంద ధైర్యమూ ఎవరూ చేయరు. కాని ప్రకాష్ రాజ్ తన మీద నమ్మకం పెట్టుకొని వచ్చిన ఒకే ఒక కారణంగా తనకున్న క్లిష్ట పరిస్థితుల్లోను సహాయం అందించారు.

ఇక ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మరో 19 రోజులపాటు లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తనవంతు సహాయం అందించడానికి ముముదుకు వచ్చారు. తినడానికి తిండి లేక చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పేదలకు అండగా నిలుస్తానని తనకు ఎంత కష్టమొచ్చినా సేవ చేయడానికి ముందుంటానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా “నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయి. అయినా సరే అప్పు తీసుకొని అయినా ఈ కష్టకాలంలో నాకు సాధ్యమైనంత సాయం అందిస్తాను. భవిష్యత్లో మళ్లీ సంపాదించుకోగలనని నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చూపించాల్సిన సమయమిది. మనమంతా కలిసి కరోనాపై పోరాడదాం. జీవితాలను నిలబెడదాం” అంటూ తెలిపారు.

దీంతో ప్రకాష్ రాజ్ స్పందన పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు వెనకున్న వాళ్ళు కూడా ఆచి తూచి మాటివ్వడం, ఆలోచించి సహాయం చేస్తాననడం చాలా మంది విషయాలల్లో గమనిస్తూనే ఉన్నాము. కాని ప్రకాష్ రాజ్ మాత్రం వీళ్ళకి భిన్నంగా స్పందించడం చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. అందుకే ప్రకాష్ రాజ్ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు నెటిజన్స్ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రకాష్ రాజ్ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో తన స్టాప్ కి మూడు నెలల జీతాలు ముందుగానే ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version