ఎన్టీఆర్ ను చంపేసి..చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు : శ్రీకాంత్ రెడ్డి

-

ఎన్టీఆర్ ను తానే చంపేసి ఇప్పుడు ఎవడో తాగుబోతు వ్యక్తి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో స్వయంగా ఒక ఐపీఎస్ టీడీపీలో చేరండి అని అడిగేవాడని.. ఈ వ్యవహారాల కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీసు కూడా నడిపే వాడని మండిపడ్డారు. ఐపీఎస్ లను ఈ స్థాయికి దిగజార్చిన వ్యక్తి చంద్రబాబు అని.. సీఎం ఢిల్లీ పర్యటన విజయవంతం అవుతుందని ఓర్వలేక చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని అగ్రహించారు.

అమరావతిలో డ్రైనేజీ నుంచి మంచినీళ్ళ వ్యవస్థ కూడా లేదని.. 10వేల కోట్లు ఖర్చు పెట్టాం అని చంద్రబాబు చెప్పటం ఆశ్చర్యంగా ఉందన్నారు. కనీసం ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి చేయకుండా 10 వేలు ఎలా ఖర్చు అయ్యాయని.. ఈ డబ్బులతో మూడు రాజధానులు నిర్మించగలిగే పరిస్థితి ఉందని మండిపడ్డారు. తాను ఉంటున్న ఇంటికి కూడా డ్రైనేజీ లేకపోవడంతో నదిలోకే మురికి వదిలేస్తున్నారని.. న్యాయస్థానం టు దేవస్థానం యాత్రకు వందల కోట్లు చందాలు వసూలు చేయటం ఏంటి?? అని ప్రశ్నించారు. విజన్ ఉన్న నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం ఎందుకు కనిపించలేదన్నారు. 10వేల కోట్లతో ఎంత అభివృద్ధి చేయవచ్చు.. చంద్రబాబు హయాంలో 20వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని చురకలు అంటించారు. కరోనా లేని ఐదేళ్ళ కాలంలో వచ్చిన పెట్టుబడులు ఇవేనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version