జగన్ అక్రమాస్తుల కేసులో ఇబ్బందులు ఐఏఎస్ శ్రీ లక్ష్మీ ఏపీ కేడరుకు రావాలని చాలాకాలంగా పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. క్యాడర్ మార్పునకు క్యాట్ అంగీకరించడంతో అంతా కొలిక్కివచ్చినట్టేనని భావించారు. అయితే శ్రీలక్ష్మీ భవిష్యత్తు ఇప్పటికీ కేంద్రం చేతుల్లోనే ఉందనే అంటున్నారు. డీఓపీటీలో ఆమె విషయం ఇంకా పెండింగులోనే ఉందని అంటున్నారు. విభజన సమయంలో ఐఏఎస్ శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. కానీ ఈమెను ఏపీ క్యాడర్‌కు మార్చేందుకు పెద్దల ప్రయత్నాలు చేస్తున్నారు.
శ్రీలక్ష్మీ క్యాడర్ మార్పునకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కుదరదని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో శ్రీలక్ష్మీ క్యాట్‌ను ఆశ్రయించింది. అందులో ఆమెకు ఊరట నివ్వడంతో తెలంగాణలో రిలీవై ఏపీలో జాయినింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఏపీ క్యాడరులోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ నెల 10నుంచి ఏపీ క్యాడరులోకి శ్రీలక్ష్మీరానున్నారు. అయితే ఇదంతా డీఓపీటీ నిర్ణయానికి లోబడి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. డీఓపీటీ అంగీకరిస్తుందా..? లేదా అని ఐఏఎస్‌లలో చర్చ జరిగుతోంది. అయితే అంతా సవ్యంగా జరిగి ఆమె ఏపీ క్యాడర్ లోకి వస్తే శ్రీలక్ష్మీని సీఎంఓలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.