తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతోంది శ్రీలంక. తినడానికి తిండి లేక… తిందాం అన్నా కొనలేని పరిస్థితి ఉంది. అంతలా ఆదేశాన్ని ఆహారం కొరతను ఎదుర్కొంటోంది. బియ్యం, పప్పులు, చికెన్, పళ్లు ఇలా అన్నింటికి రేట్లు ఆకాశాన్ని అంటాయి. తీవ్రమైన ఇంధన కొరతను కూడా ఎదుర్కొంటోంది. డిజిల్, పెట్రల్ కోసం గంటల తరబడి ఎదురుచాడాల్సని పరిస్థితి. దీంతో శ్రీలంక భారత్ సాయాన్ని అడుగుతోంది.
ఇప్పటికే సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ డిజిల్ ను సరఫరా చేసింది. దాదాపుగా 40 వేల టన్నుల డిజిల్ ను ఇటీవల సరఫరా చేసింది. తాజాగా బియ్యాన్ని సరఫరా చేస్తోంది. తెలంగాణ, ఏపీలకు సంబంధించిన బియ్యాన్ని శ్రీలంకకు సరఫరా చేస్తోంది భారత్. శ్రీలంక అభ్యర్థన మేరకు బియ్యాన్ని వెంటనే సరఫరా చేసింది. కాకినాడ, విశాఖపట్నం, చెన్నై, ట్యుటికోరిన్ తదితర పోర్టుల నుంచి బియ్యం, శ్రీలంకకు ఎగుమతి చేయనున్నారు. కాకినాడ పోర్ట్ నుంచి నేడు రెండు వేల మెట్రిక్ టన్నులతో కార్గో బయలుదేరుతోంది.