దొరసానికి దేవరకొండ కిస్.. అది బెడ్ రూంలో చేసే పనేగా జీవితా.. శ్రీరెడ్డి అటాక్

-

వెండి తెరపై మొదటిసారి అరంగేట్రం చేసినా.. ఆనంద్, శివాత్మిక తమ పాత్రల మేరకు బాగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అంతా బాగానే ఉన్నా.. వీళ్లిద్దరి కెమిస్ట్రీపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి విరుచుకుపడింది.

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మొదటి సినిమా దొరసాని మొన్న జులై 12 న రిలీజయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక నటించింది. తనకు కూడా ఇదే మొదటి సినమా. సినిమా మొత్తం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్యూర్ లవ్ స్టోరీ. ఈ సినిమాను తెరకెక్కించింది కేవీఆర్ మహేంద్ర.

వెండి తెరపై మొదటిసారి అరంగేట్రం చేసినా.. ఆనంద్, శివాత్మిక తమ పాత్రల మేరకు బాగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అంతా బాగానే ఉన్నా.. వీళ్లిద్దరి కెమిస్ట్రీపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి విరుచుకుపడింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. దొరసాని సినిమాను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి సంచలన కామెంట్లు చేసింది.

అయితే.. శ్రీరెడ్డి.. దొరసాని సినిమాను టార్గెట్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఇటీవలే డిగ్రీ కాలేజీ అనే ఓ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా జీవిత.. ఆ సినిమాల్లోకి అభ్యంతరకరమైన సన్నివేశాలపై మండిపడింది. బెడ్ రూంలో చేయాల్సిన పనులు రోడ్ మీద చేస్తామా.. అంటూ జీవిత చేసిన కామెంట్స్ ను ఇప్పుడు దొరసాని సినిమాకు వర్తింపజేసింది శ్రీరెడ్డి.

ఎందుకంటే.. దొరసాని సినిమాలో శివాత్మిక, ఆనంద్ మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుందట. ఆ సీన్ పైనే విరుచుకుపడింది శ్రీరెడ్డి.

జీవిత గారు.. నీ కూతురు దగ్గరికి వచ్చేసరికి ఎన్ని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు. మీరెలాగూ మూవీ అసోసియేషన్ కార్డుకు అడ్డం పడుతున్నారని తెలుసు. అయినప్పటికీ మాట్లాడుతా. కిస్ అనేది బెడ్ రూంలో చేసుకునేది కాదా? రోడ్డు మీద చేసుకునేదా? నీ కూతురుకు ఒక న్యాయం.. ఇంకొకలకు ఇంకో న్యాయమా? అంటూ ఫేస్ బుక్ లైవ్ లోనూ జీవితపై విరుచుకుపడింది శ్రీరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version