దారుణంగా అడుగంటిన శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వలు

-

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండుకుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టులో ఒక్కసారిగా నీటి నిల్వలు అడుగంటాయి. గురువారం నాటికి ప్రాజెక్టు నీటి నిల్వ 215 టీఎంసీల నుంచి 130 టీఎంసీలకు దారుణంగా పడిపోయినట్లు అధికారిక వర్గాల సమాచారం. అటు ఆంధ్ర,ఇటు తెలంగాణకు చెందిన కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలు పోటిపడి మరీ విద్యుత్ ఉత్పత్తి చేయడంతో ఈ దుస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రతి రోజూ విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్రాజెక్టులోని నీటిని వినియోగిస్తుండగా ఔట్‌ ఫ్లో 35,315 క్యూసెక్కులుగా ఉంటుంది. దీంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 867.40 అడుగులకు చేరుకుంది.ఈ క్రమంలనే కుడి గట్టులో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేయగా..ఎడమగట్టులో మాత్రం కొనసాగుతోంది.ఔట్ ఫ్లో ఇలానే కొనసాగితే మరో 2 నెలల్లో జలాశయం పూర్తిగా అడుగంటిపోతుందని..ఫలితంగా వచ్చే వేసవిలో నీటి ఎద్దడి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news