తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలి రేసులో ప్రముఖులు.. ఛాన్స్ ఎవరికి..?

-

తెలంగాణాలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడంతో పార్టీ పదవులకు పుల్ డిమాండ్ ఉంది.. పదవుల మధ్య పోటీ కూడా తీవ్రంగానే కనిపిస్తోంది.. తమకు పదవులు ఇవ్వాలంటూ కొందరు డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్తుంటే..మరికొందరు మాత్రం సీఎం ద్వారా ప్రయత్నాలు చేయిస్తున్నారు.. అయితే ప్రస్తుతం తెలంగాణ మహిళా అధ్యక్షురాలి పోస్ట్ కు ప్రముఖులు పోటీ పడుతూ ఉండటంతో.. ఆ పార్టీలో పొలిటికల్ హీట్ పెరిగింది..

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కీలక పోస్టులను భర్తీ చేసే పనిలో పడింది హైకమాండ్.. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా మహేష్ గౌడ్ నియమించింది.. ఇప్పుడు మహిళా అధ్యక్షురాలిని ఎంపిక చేసే పనిలో పడింది.. గతంలో పనిచేసినవారిని.. కొత్తవారిని సీరియస్ గా పరిశీలిస్తోంది.. తెలంగాణ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సునీతారావు పదవి కాలం ముగిసి ఐదు నెలలు కావొస్తోంది.. ప్రస్తుతం ఆమె ఆపద్దర్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు..

మరోసారి తనకే అవకాశం ఇవ్వాలని సునీతారావు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట.. జాతీయ స్థాయిలో నేతలను కలిసి.. తాను చేసిన పోరాటాలను, సభ్యత్వాలను గుర్తు చేస్తున్నారు.. ఒక వేళ కొత్తవారికి అవకాశం ఇవ్వాలనుకుంటే.. తనకు నామినెటెడ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని
సమాచారం. అయితే గత ఎన్నికల్లో గోషామహాల్ నుంచి పోటీ చేసిన ఆమె.. ఓటమి పాలవ్వడంతో.. నామినెటెడ్ పదవి దక్కే చాన్స్ లేదనేది పార్టీలో వినిపిస్తున్న టాక్..

సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని బలమైన మహిళా నేతను అధ్యక్షురాలిని చెయ్యాలని అధిస్టానం భావిస్తోంది.. ఈ క్రమంలో గద్వాల్ మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్యకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. సీఎం స్వంత జిల్లా కావడంతో.. ఆయన మద్దతుకూడా సరితాకే ఉన్నట్లు పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది.. ఈ నేపథ్యంలో సరితకు అవకాశం ఇస్తే.. సునీతారావ్ ను బుజ్జగించాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. మొత్తంగా మహిళా అధ్యక్షురాలి పోస్టు ఎవరికి వరిస్తుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news