ఏసీబీకి చేరిన శ్యామ్‌ కే నాయుడు కేసు !

-

ఎస్ ఆర్ నగర్ ఎస్‌ఆర్‌ నగర్‌ మాజీ ఇన్‌స్పెక్టర్‌ మురళీ కృష్ణపై నటి శ్రీసుధ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. తన నుంచి మురళీ కృష్ణ లంచంగా కొంత డబ్బు తీసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం చోటా కె.నాయుడు తమ్ముడు శ్యామ్‌ కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి శ్రీ సుధ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే ఈ కేసు దర్యాప్తు కోసం మురళీ కృష్ణ తన నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆమె గతంలోనే ఆరోపించింది. అంతే కాక ఈ కేసులో శ్యామ్‌ కె.నాయుడును అరెస్టు చేయకపోవడంతోపాటు కోర్టులో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ లెటర్‌ సృష్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐతో మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఆమె ఏసీబీకి అందజేశారు. సీఐ మురళి కృష్ణ పై కేస్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version