సినిమా ఫెయిల్యూర్ కు బాధపడను… జీవితంలో అదంతా ఒక భాగమే… శృతిహాసన్..!

-

శృతి హాసన్ సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అది మాత్రమే శృతి హాసన్ సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి కూడా అనేక మంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. తాజాగా కూడా శృతి హాసన్ అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా శృతి హాసన్ కు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి.

అందులో భాగంగా శృతి హాసన్ కు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. మీరు మూవీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా ఫీలవుతారు అనే ప్రశ్న శృతి హాసన్ కు ఎదురవగా… ఆ ప్రశ్నకు శృతి హాసన్ సమాధానమిస్తూ… మూవీ ఫెయిల్యూర్ అయితే బాధ పడతాను. కానీ జీవితంలో అదంతా ఒక భాగమే. మన పనిని మనం కరెక్ట్ గా చేశామా లేదా అనేది ఇంపార్టెంట్. ఫెయిల్యూర్, సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు కదా అంటూ శృతి హాసన్ సమాధానం ఇచ్చింది.

శృతి హాసన్ ను మరొక నెటిజన్ వాలెంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని అడిగాడు. ఈ ప్రశ్నకు శృతి హాసన్, శాంతను హాజరిక కలిసి సమాధానమిస్తూ… పువ్వులతో డెకరేట్ చేసి, రొమాంటిక్‌గా విష్ చేశాడు.. అని శాంతను హాజరిక గురించి శ్రుతి హాసన్ చెప్పింది. దాని తరువాత ఇద్దరం కలిసి పాస్తా ను చేసుకొని తిన్నాం అంటూ సమాధానం ఇచ్చింది. శృతి హాసన్ ఇలా తాజాగా నెటిజన్లు అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news