తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నున్న ఆదర్శనగర్ లో యాదవ సామాజికవర్గ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కులగణన
చేపట్టి బీసీ కులాల లెక్కలు తేల్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం , సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తి చేశారు. అందుకే యాదవుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఆమె పాత్ర ఏం లేదు అన్నవాళ్లు ఇవాళ కులగణను తప్పుల తడక అంటే ఎవరు? నమ్ముతారు అని అన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాంగ్ డిసిషన్ తీసుకున్నది. నిజానికి ఈ సీటును కాంగ్రెస్ పార్టీ యాదవు లకు కేటాయిస్తే తప్పకుండా గెలిచేది. యాదవులకు ఇవ్వకుండా పార్టీలోనే కొందరు అడ్డు తగిలారు. యాదవ కులస్తులను కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఇప్పటికీ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.. తన కొడుకు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ సీటు ఇచ్చింది. తనకు నేరుగా సోనియా, లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు చెప్పడం పీసీసీలో చోటు ఇచ్చారని అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.