డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చాలావరకు విమర్శలకు దూరంగా ఉంటారు. ‘బాహుబలి’ సినిమా విజయంతో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మరియు తనకి కూడా మంచి పేరు సంపాదించి పెట్టింది. అయినా కానీ చాలా వరకు పొంగిపోయిన సందర్భాలు, కాలర్ ఎగరేసే విధంగా తలబిరుసు మాటలు మాట్లాడకుండా ఎప్పుడు రిజర్వుడు గా మీడియాతో వ్యవహరిస్తూ వస్తుంటారు. అలాంటిది లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవటంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రాజమౌళి కూడా ఇంటికే పరిమితమై ఇటీవల ఓ ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
ఇప్పటి వరకు ఎక్కడా దొరకని రాజమౌళి ఇక్కడ దొరకటంతో తీవ్రంగా నెటిజన్ల తో పాటు కొంతమంది ప్రముఖులు టార్గెట్ చేశారు. తాజాగా ‘మిఠాయి’ అనే సినిమాని అందించిన డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దీనిపై స్పందిస్తూ రాజమౌళిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ లెటర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మీరు తీసిన సినిమాలలో చాలావరకూ కాపీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మీరు అద్భుతమైన ‘పారసైట్’ చిత్రం గురించి బ్యాడ్ కామెంట్స్ చేయడం తగదు’ అంటూ రాజమౌళిపై ప్రశాంత్ కుమార్ విమర్శల వర్షం కురిపించారు. ఆ డైరెక్టర్ ఒక్కడే కాదు చాలా మంది టార్గెట్ చేస్తున్నారు .. నువ్వు ఆ సినిమా చూస్తున్నప్పుడు పడుకున్నా పరవాలేదు మీ నాన్నగారు పడుకోకుండా ఉంటే చాలు … ఎందుకంటే నీ కథలు రాసేది ఆయనే కదా నీకు కథలు రాసుకునే సీన్ లేదు కదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.