ఈ విషయంలో ఈ ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్స్ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయా ..?

-

టాలీవుడ్ లో ప్రస్తుతం నలుగురు స్టార్ ప్రొడ్యూసర్స్ భారీ ప్రాజెక్ట్స్ నుంచి చిన్న సినిమాల వరకు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసందే. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి సురేష్ బాబు, దిల్ రాజు, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినేని నాగార్జున. ఇండస్ట్రీలో అధిక శాతం సినిమాలను నిర్మిస్తుంది ఈ నిర్మాణ సంస్థలే. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో అన్ని సంస్థలల్లోను సినిమా నిర్మాణం దగ్గర్నుంచి రిలీజ్, డిస్ట్రిబ్యూషన్ వరకు అన్నీ ఆగిపోయాయి.

 

లాక్‌డౌన్ కారణంగా రిలీజ్ అనుకున్న సినిమాల డేట్స్ మొత్తం తారుమారు అయ్యాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పట్లో జనాలు థియోటర్స్ కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. వాస్తవంగా కూడా అదే జరుగుతుందని అందరు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో మన నిర్మాతల ఆలోచన ధోరణి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంది. దిల్ రాజు లాక్ డౌన్ ఎత్తేయగానే కొంత గ్యాప్ తీసుకొని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. నెమ్మదిగా జనాలు వస్తారు అన్న భావనలో ఉన్నారు.

కాని ఈ విషయంలో అల్లు అరవింద్ మాత్రం వేరేలా భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రభావం వచ్చే సంవత్సరం ప్రథమార్థం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది కాస్త ప్రాక్టికల్ గా చూస్తే నిజమే అనిపిస్తుంది. రోజు రోజు కి కరోనా ప్రభావం బాగా పడుతుంది. కేసులు కొత్తవి నమోదవుతూనే ఉన్నాయి. దాంతో లాక్ డౌన్ ఎప్పటికప్పుడు పొడగిస్తూనే ఉన్నారు. అంచనా ప్రకారం జూన్ వరకు ఈ లాక్ డౌన్ పొడగించే అవకాశాలున్నాయి. దాంతో అల్లు అరవింద్ ఇలా అభిప్రాయపడుతున్నారు. మరి లాక్ డౌన్ తర్వాత నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version