SSMB 29 : ట్రెక్కింగ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

-

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న సినిమా కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా …. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఉగాదికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని సమాచారం. అమెజాన్ అడవుల నేపథ్యంతో అడ్వెంచర్ గా ఈ చిత్రం సాగబోతోంది. దీంతో మహేష్ బాబు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల జర్మనీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

జర్మనీ వెళ్లిన ఆయన బ్లాక్ ఫారెస్ట్లో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నీరు గడ్డకట్టే వాతావరణంలో ట్రెక్కింగ్ చేసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ లో రాసుకొచ్చరు. కాగా రాజమౌళితో తెరకెక్కనున్న మూవీ అడ్వెంచర్ నేపథ్యంలో సాగనుండగా.. ఈ సినిమా కోసమే మహేశ్ ట్రెక్కింగ్ చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version