BREAKING : SSMB29 లో విలన్ గా అమీర్ ఖాన్…

-

త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రస్తుతం గుంటూరుకారం అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే సమ్వత్సరం సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇయర్ మొదట్లో దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ఫారెస్ట్ నేపథ్యంతో సినిమా చేయడానికి మహేష్ బాబు ఓకే చెప్పారు. కాగా ఈ సినిమా నుండి ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ను ఢీ కొట్టే విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ ఇప్పటి వరకు ఈ వార్తపై అటు రాజమౌళి టీం నుండి కానీ ఇటు అమీర్ ఖాన్ నుండి ఎటువంటి ప్రకటన లేదు. మరి చూద్దాం ఇక ముందు అయినా ఏమైనా అప్డేట్ వస్తుందా ?

Read more RELATED
Recommended to you

Latest news