ఉదయనిధి వ్యాఖ్యలపై మౌనం వీడిన స్టాలిన్.. ప్రధానికి కౌంటర్..!

-

డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల దుమారంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మొదటిసారి స్పందించారు. ఉదయనిధి ఏం మాట్లాడారో తెలుసుకోకుండా ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్ చేయడం సరికాదన్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని మంత్రి ఉదయనిధి ఇటీవల ఓ సమావేశంలో వ్యాక్యానించిన విషయం విధితమే. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మంత్రి పై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేది లేదని.. ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. కుల వివక్ష లేకుండా అందరికీ అన్నీ దక్కాలనేది ద్రావిడ మోడల్ ఉద్దేశమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పస్టం చేశారు. దీంతో బీజేపీ, డీఎంకే మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కొడుకు మాటల దుమారంపై తండ్రి స్టాలిన్ స్పందిస్తూ.. బీజేపీ వక్రీకరించినట్టు జాతి నిర్మూలనకు మంత్రి పిలుపునివ్వలేదని.. కేవలం వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశారు.

వాస్తవాలను ధ్రువీకరించడానికి అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ బాధ్యత కలిగిన ప్రధానమంత్రి కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు వాస్తవాలను విస్మరించడం నకిలీ వార్తలను ప్రచారం చేయడం బాధ కలిగించిందన్నారు. సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై తప్పుగా విమర్శిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. అణచివేత సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బీజేపీ అనుకూల శక్తులు అతని వైఖరిని సహించలేకపోతున్నాయని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version