ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజధానిపై చేసిన ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలు ఒక ఎత్తు.. ఇక, రేపటి నుంచి వరుసగా రెండు రోజులు సాగే.. వ్యూహ ప్రతివ్యూహాలను ఆయన ఎదుర్కొనడం అ నేది మరో కీలక ఎత్తు.. అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే మూడు రాజధానుల విషయంపై మడమ తి ప్పేది లేదని అంటున్న జగన్ ప్రభుత్వం న్యాయ విచారణలకు కూడా సమయం ఇవ్వకుండా దూకుడు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే జీఎన్ రావు, బీసీజీ నివేదికలను అధ్యయనం చేసి న హైపవర్ కమిటీపై కేబినెట్ చర్చించడం, ఆ వెంటనే అసెంబ్లీలో పెట్టి.. ఆమోదం పొందడం వంటి కీలక అడుగులు వేస్తోంది.
మరి ఇప్పటికే మూడు రాజధానులు ఒద్దు.. అమరావతే ముద్దు.. అని నినాదాలతో హోరెత్తిస్తూ.. తనదైన శైలిలో ఉద్యమాలు చేస్తున్న చంద్రబాబు చట్టసభల్లో వైసీపీ దూకుడును అడ్డుకోవడం అగ్ని పరీక్షే అం టున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ కన్నా ముందు టీడీపీ పక్ష సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు . ఆదివారం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని ఆయన మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశాన్ని రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో తన పార్టీ తరపున గెలిచిన 23 మందిలో ఇద్దరిని మినహాయిస్తే.. మిగిలిన 21మందితో చర్చించి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడ్డుకోవడంపై ఆయన చర్చిస్తారు.
ఇప్పుడు ఈ పరిణామం.. పార్టీలోను, రాజకీయంగాకూడా కీలక అంశంగా మారింది. ఇప్పటి వరకు మూడు రాజధానుల విషయంలో మొహమాటానికో.. లేక.,. బాబుకు మద్దతిచ్చేందుకో.. వ్యతిరేకిస్తున్న నాయకులు ఇప్పుడు టీడీపీ పక్ష సమావేశానికి వస్తే.. అధికారికంగా కూడా దీనికి వ్యతిరేకమని చెప్పడమే అవుతుంది. అయితే, టీడీపీకి ప్రధానంగా ఉన్న బలం .. ఉత్తరాంధ్రలోనే ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరిలో కీలక స్థానాలు టీడీపీ సొంతం చేసుకుంది. ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్, టెక్కలి నుంచి అచ్చన్నా యుడు, విశాఖ నార్త్ గంటా శ్రీనివాసరావు, విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్, విశాఖ వెస్ట్ గణబాబులు విశాఖలో రాజధానిని వ్యతిరేకించే పరిస్థితి లేదు.
సో.. ఈ ఆరుగురు కూడా వచ్చే అవకాశం లేదు. తూర్పుగోదావరి ప్రజాప్రతినిధులు కూడా వైజాగ్‌ను వ్యతిరేకిస్తారని అనుకోలేం. ఒక వేళ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా అసెంబ్లీలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే సాహసం చేయరు. ఇక, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌లు కూడా కర్నూలుకు హైకోర్టును వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. మొత్తంగా చూసుకుంటే.,. ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేల్లో కనీసంలో కనీసం ఆరుగురు బాబుకు మద్దతిచ్చే పరిస్థితి లేదు. మిగిలిన పదిహేను మందిలో ఎంత మంది ఆయన వెంట నడుస్తారో కూడా డౌట్‌గానే ఉంది. మొత్తంగా చూసుకుంటే.. అసెంబ్లీ కన్నా ముందుగానే టీడీపీ పక్ష సమావేశంలోనే చంద్రబాబుకు పెద్ద అగ్ని పరీక్ష ఎదురవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.