తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్

-

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. వారిలో ఐదుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. నర్సీ పట్నానికి చెందిన బి.నాయుడు బాబు(51), విశాఖకు చెందిన రజిని(47), లావణ్య(40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల(50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక(49), మరణించినట్టు గుర్తించారు. ఈ తొక్కిసలాటలో మరో 48 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిలో 40 మంది డిశ్చార్జీ అయ్యారు. 8 మంది చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి స్వీమ్స్, రుయా ఆసుపత్రిలలో చికిత్స అందించామని తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version